క్రూర మృగంలా ప్రవర్తించిన డాక్టర్ 

Suma Kallamadi

ఓ సర్జన్‌ క్రూరవాంఛతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 250 మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ  ఉదంతం ఇది. చేసేది వైద్య వృత్తి.. కానీ మనసు మాత్రం వికృతమైన ఆలోచనలకు నిలయం.ముప్పై ఏళ్లుగా కొనసాగిన అతడి అరాచకాలు సీక్రెట్‌ డైరీల ద్వారా బట్టబయలయ్యాయి. వివరాలు...గతంలో  ఫ్రాన్స్‌కు చెందిన జోయెల్‌ లే స్కౌరానెక్‌(68) అనే వ్యక్తి సర్జన్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో తమ ఇంటి పక్కన నివాసం ఉండే ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం గురించి పాప తల్లిదండ్రులు2017లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. ఆ తర్వాత జోయెల్‌ బంధువులు, అతడి దగ్గర చికిత్స పొందిన మరి కొంతమంది అమ్మాయిలు ఇదే తరహా ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

దీనిపై పోలీసుల దర్యాప్తులో భాగంగా విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. విచారణ నిమిత్తం జోయెల్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు అతడి సీక్రెట్‌ డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దాదాపు 250 మంది చిన్నారుల పేర్లు ఉన్నాయి. అతడు వారిని లైంగికంగా వేధించిన తీరు, అత్యాచారానికి ఒడిగట్టిన విధానం గురించి  డైరీలో రాసుకున్నాడు. అంతేగాక అతడి గదిలో చైల్‌‍్డ పోర్నోగ్రఫీ సీడీలు, బొమ్మలు లభించాయి. వీటిని పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలో సోమవారం స్థానిక కోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టింది.

 

ఇందులో భాగంగా 250 మందిని జోయెల్‌ బాధితులుగా పేర్కొన్న ప్రభుత్వ న్యాయవాది... వారిలో దాదాపు 209 మంది ఆచూకీని పోలీసులు కనిపెట్టారని కోర్టుకు తెలిపారు. అందులో చాలా మంది తమ చిన్నతనంలో అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా కొన్ని విషయాలు గుర్తుకువచ్చినట్లు తెలిపారన్నారు. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. 

 

ఈ క్రమంలో ఈ కేసును ఫ్రాన్స్‌ చరిత్రలోనే అత్యంత హేయమైన పెడోఫిలియా(చిన్నారులపై లైంగిక అత్యాచారాలు) కేసుగా జడ్జి అభివర్ణించారు. అయితే ఇందుకు అభ్యంతరం తెలిపిన జోయెల్‌ తరఫు న్యాయవాది... ఈ కేసులో 181 మంది మాత్రమే మైనర్లుగా ఉన్నారని... అందులోనూ కొంతమంది మాత్రమే తన క్లైంట్‌పై ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. ఇక ఈ కేసులో జోయెల్‌ దోషిగా తేలినట్లైతే అతడికి 20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని స్థానిక న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా అశ్లీల సీడీలు(చైల్‌‍్డ పోర్నోగ్రఫీ) కలిగి ఉన్నాడనే ఆరోపణలతో గతంలోనూ జోయెల్‌ అరెస్టయ్యాడు. ఈ కేసు కూడా విచారణలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: